లాస్ట్ వీక్ విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయ్’ సినిమాకు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ కుర్రాళ్లు ఈ సినిమాను తెగ ఆదరిస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా, లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా కథ, కథనం పర్ఫెక్ట్గా కుదరడంతో, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రిలీజ్‌కు ముందు తక్కువ హైప్ ఉన్నప్పటికీ, రిలీజ్ తర్వాత మౌత్ టాక్‌తో ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సోషల్ మీడియా, వెబ్ సైట్లలో ఈ సినిమాకు పాజిటీవ్ రివ్యూలు వస్తున్నాయి.
ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన నటీనటులు అంతకుముందు పెద్దగా పరిచయం లేనివారైనా, వారి పీక్స్ పర్ఫార్మెన్స్తో అందరి దృష్టిని ఆకర్షించారు. మౌత్ టాక్ ఫుల్ పాజిటీవ్‌గా రావడంతో కలెక్షన్లు కూడా బీభత్సంగా వస్తున్నాయి. ఈ సినిమా డే 1 నుంచే సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం, ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు ప్రాఫిట్ జోన్లోకి వెళ్లింది.
దాదాపు రూ. 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రంగంలోకి దిగిన ఈ సినిమా, కేవలం 5 రోజుల్లోనే దాదాపు రూ. 10 కోట్ల రేంజ్లో గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. షేర్ పరంగా ఇది రూ. 5.5 కోట్ల రేంజ్లో ఉంది. అంటే, నిర్మాతలు అప్పటికే రూ. 2 కోట్లకు పైగా ప్రాఫిట్ జోన్లోకి వచ్చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకున్న పాజిటీవ్ టాక్‌ను బట్టి చూస్తే, ఈజీగా రూ. 10 కోట్లు షేర్ కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా కథాంశం విషయానికొస్తే, తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో 2010లో జరిగిన యథార్థ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.









