ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇటీవల జరిగిన ‘వారణాసి’ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా మండిపడ్డారు.
-
రాజమౌళి వ్యాఖ్యలు: ‘వారణాసి’ ఈవెంట్లో సాంకేతిక లోపం తలెత్తినప్పుడు, “నాకు దేవుడిపై నమ్మకం లేదు. మా నాన్నగారు (విజయేంద్ర ప్రసాద్) టెన్షన్ పడొద్దని, ‘హనుమంతుడు అన్నీ సవ్యంగా నడిపిస్తాడు’ అని చెప్తారు. ఈ టెక్నికల్ సమస్య వచ్చినప్పుడు, ఇలాగేనా నడిపించేది అని నాకు కోపం వచ్చింది” అని రాజమౌళి అన్నారు. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయంటూ పలు హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
రాజాసింగ్ డిమాండ్లు:
-
హిందువుల మనోభావాలను దెబ్బతీసిన రాజమౌళిని జైల్లో పెట్టాలి అని డిమాండ్ చేశారు.
-
దేవుళ్లపై నమ్మకం లేనప్పుడు వారి పేరుతో సినిమాలు తీసి కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారని ప్రశ్నించారు. ‘బాహుబలి’లో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించారని మండిపడ్డారు.
-
హిందూ ధర్మంపై అభిమానం లేని రాజమౌళి సినిమాలను హిందువులంతా బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
-
రాజమౌళి క్షమాపణ చెప్పాలని, లేదంటే ‘వారణాసి’ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.
-
గతంలో కూడా రాముడు, కృష్ణుడిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు.
-








