ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అనౌన్స్‌మెంట్ నుంచే సంచలనం సృష్టించిన ఈ ప్రాజెక్ట్‌ను ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మక విజువల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణె కథానాయికగా నటిస్తుండగా, సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘రాకా’ ఫస్ట్ గ్లింప్స్‌ను మరో రెండు నెలల్లో విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారట. ముఖ్యంగా ఆగస్టు నెలలో ఈ గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే ఇది కేవలం హీరో ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే కాదని, ‘రాకా’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే పవర్‌ఫుల్ విజువల్ ప్రెజెంటేషన్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. సినిమా కాన్సెప్ట్, కథా నేపథ్యం, విజువల్ స్కేల్‌ను హైలైట్ చేస్తూ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించేలా ఈ గ్లింప్స్‌ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నారనే ప్రచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. కెరీర్‌లోనే సరికొత్త అవతార్‌లో బన్నీ కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే స్టార్ కాస్టింగ్, భారీ టెక్నికల్ టీమ్, అట్లీ-బన్నీ కాంబినేషన్ కారణంగా ‘రాకా’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు అందరి చూపు ఆగస్టులో రానున్న ఫస్ట్ గ్లింప్స్‌పైనే ఉంది.









