బ్లాక్‌బస్టర్ హిట్ ‘యానిమల్’ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా సీక్వెల్‌గా రాబోతున్న ‘యానిమల్ పార్క్’ షూటింగ్‌ను 2027లో ప్రారంభించి, 2028లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం సందీప్ వంగా ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా పనుల్లో బిజీగా ఉండగా, అది పూర్తయిన వెంటనే రణ్‌బీర్ కపూర్‌తో ఈ భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు.
ఈ కీలక ప్రకటనను సందీప్ వంగా జపాన్‌లో జరిగిన ‘యానిమల్’ ప్రమోషన్స్‌లో వెల్లడించారు. ఫిబ్రవరి 13న ఈ చిత్రం జపాన్‌లో విడుదల కానున్న నేపథ్యంలో హీరో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఆయన అక్కడ సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడి అభిమానులతో ముచ్చటిస్తూ, సినిమా కథాంశంపై వస్తున్న రకరకాల ఊహాగానాలకు తెరదించారు. పార్ట్-1 సృష్టించిన ఇంపాక్ట్ దృష్ట్యా సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉండటంతో, పక్కా టైమ్‌లైన్‌తో ముందుకు వెళ్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
‘యానిమల్ పార్క్’ అనే టైటిల్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని కూడా దర్శకుడు వివరించారు. ఈ సీక్వెల్‌లో రణ్‌బీర్ కపూర్ ద్విపాత్రాభినయం చేయనుండగా, ఇద్దరు అన్నదమ్ముల (రణ్‌విజయ్ మరియు అజీజ్) మధ్య జరిగే భీకర పోరుగా ఇది ఉండబోతోంది. మొదటి భాగం కంటే మరింత రా అండ్ రస్టిక్ గా, ఎక్కువ మంది ‘యానిమల్స్’ (పవర్‌ఫుల్ క్యారెక్టర్స్) మధ్య సాగే యుద్ధంలా ఈ సినిమా ఉంటుందని ఆయన హింట్ ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత రెట్టింపు అయింది.









