Search
Close this search box.

  మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! మెగా 158 షూటింగ్ మొదలు..!

March 24, 2026 9:57 AM | Aditya369 News

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! మెగా 158 షూటింగ్ మొదలు..!

మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్! చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ జోడీ మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతోంది. మెగాస్టార్ కెరీర్‌లో 158వ చిత్రంగా రూపొందనున్న ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

సినిమా అధికారిక పూజా కార్యక్రమాలను ఈ నెలాఖరులో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తొలి షెడ్యూల్‌లోనే చిరంజీవి సోలో ఎంట్రీ సీన్స్‌తో పాటు ఓ పవర్‌ఫుల్ మాస్ సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ నిర్మిస్తున్నారు.

ఇటీవల వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ తర్వాత చిరంజీవిని ఈ సినిమాలో పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు. అయితే కేవలం మాస్ ఎలిమెంట్స్‌కే కాకుండా, ఫ్యామిలీ ఎమోషన్స్‌కూ సమాన ప్రాధాన్యత ఇస్తూ దర్శకుడు బాబీ ప్రత్యేక కథను సిద్ధం చేశారని సమాచారం. మెగాస్టార్‌ను కొత్తగా ప్రజెంట్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.

ఇప్పటికే వాల్తేరు వీరయ్య సక్సెస్‌తో ఈ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి. మాస్, ఎమోషన్ కలయికగా రాబోతున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందేమో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు