తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీవల వరుస కారణాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల విడాకులు, నయనతార బయోపిక్ వివాదం వంటి అంశాలతో హాట్ టాపిక్‌గా మారిన ఆయన ఇప్పుడు మరలా డేటింగ్ రూమర్స్‌తో చర్చల్లోకి వచ్చాడు. ధనుష్ మరియు మరాఠీ నటి మృణాల్ ఠాకూర్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని, వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్లో ఉన్నారంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి ప్రవర్తన చూస్తుంటే ఈ ప్రచారాల్లో కొంత నిజం ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ రూమర్స్‌ను ఇప్పటివరకు వీరిద్దరూ ఖండించలేదు. అంతేకాదు వీరిద్దరూ పబ్లిక్ ఈవెంట్స్‌లో, సెలబ్రేషన్స్‌లో తరచూ కలిసి కనిపించడం ఈ పేలవాలకు మరింత బలం చేకూరుస్తోంది.
ఇటీవల మృణాల్ ఠాకూర్ బర్త్‌డే పార్టీ నిర్వహించగా, ఆ వేడుకకు చాలా కొద్దిమంది మాత్రమే ఆహ్వానించబడ్డారు. ఆ పార్టీలో ధనుష్ మరియు అతని కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. అదనంగా మృణాల్ ధనుష్ సోదరిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం, ఒకరి బర్త్‌డే పోస్టులకు మరొకరు విషెస్ చెప్పడం వంటి ఘటనలు కూడా డేటింగ్ రూమర్స్‌ను మరింత పెంచుతున్నాయి. వీరిద్దరూ పరస్పరం సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్లు చేసుకోవడం కూడా చాలామందికి అనుమానాలకు తావు కలిగిస్తోంది.
తాజాగా మృణాల్ తాజా సినిమా లీజర్ రిలీజ్‌కు సంబంధించిన పోస్టుపై ధనుష్ ప్రశంసలు కురిపించగా, మృణాల్ ప్రేమను సూచించే కేరింగ్ మరియు లవ్ ఎమోజీలతో స్పందించింది. ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అదే సమయంలో ధనుష్ తన ‘తేరే ఇష్క్ మే’ సినిమా లుక్‌ను షేర్ చేయగా, దాని పై మృణాల్ భావోద్వేగపూర్వకమైన కామెంట్ పెట్టింది. ఈ కామెంట్‌కు ధనుష్ హగ్ ఎమోజీలు, వైట్ లవ్ సింబల్‌తో రిప్లై ఇవ్వడం ఈ రూమర్స్ మరింత బలపడేలా చేసింది.
ఈ రకంగా ఒకరి పోస్టులకు మరొకరు స్పందిస్తూ రావడంతో, వీరిద్దరూ నిజంగానే రిలేషన్లో ఉన్నారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరూ ఈ రూమర్స్‌ను ఖండించకపోవడం, సోషల్ మీడియాలో ఓపెన్‌గా సాన్నిహిత్యాన్ని ప్రదర్శించుకోవడం కూడా నెటిజన్లలో చర్చకు దారితీస్తోంది. ఇది కావాలనే చేస్తున్నారా లేదా తెలియక జరుగుతుందా అనేది మాత్రం స్పష్టత లేదు. కానీ ఈ పోస్టులు, కామెంట్లు రోజురోజుకీ వీరి సంబంధంపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ రూమర్స్‌కు వీరిద్దరూ ధృవీకరణ ఇస్తారా లేదా ఇవే వార్తలుగా కొనసాగుతాయా అనే విషయంలో అభిమానులు కుతూహలంగా ఎదురు చూస్తున్నారు.
ధనుష్ వ్యక్తిగత జీవితాన్ని చూస్తే, ఆయనకు ఇప్పటికే పెళ్లి అయ్యి ఇద్దరు కుమారులు ఉన్నారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో ప్రేమ వివాహం చేసుకున్న ధనుష్, 18 ఏళ్ల పాటు కలిసి జీవించిన తర్వాత 2022లో విడాకులు ప్రకటించారు. 2024లో కోర్టు అధికారికంగా వీరికి విడాకులు మంజూరు చేసింది..








