టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ క్రేజీ కాంబోపై భారీ చర్చ జరుగుతోంది. శర్వానంద్ హీరోగా, కామెడీ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ వినూత్న చిత్రం తెరకెక్కబోతోంది. ఇప్పటికే వరుస హిట్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న శర్వానంద్.. ఇప్పుడు శ్రీనువైట్లతో జతకట్టడం అభిమానుల్లో ఆసక్తిని పెంచేసింది.
సాధారణంగా శ్రీనువైట్ల సినిమాలు అంటే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, టైమింగ్ కామెడీ, కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు గుర్తొస్తాయి. కానీ ఈసారి ఆయన తన స్టైల్‌కు కొత్త ట్విస్ట్ ఇస్తున్నారట. కామెడీకి తోడు ‘టైమ్ ట్రావెల్’ అనే సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌ను జోడించి ఓ డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. శర్వానంద్ నేచురల్ కామెడీ టైమింగ్, శ్రీనువైట్ల మార్క్ వినోదం, టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్ కలిస్తే.. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత అనిల్ సుంకర నిర్మించనున్నారు. 2026 జులైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక హీరోయిన్ విషయానికి వస్తే.. మొదట పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినా, చివరకు మిస్ ఇండియా రన్నరప్ మానస వారణాసి ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మానసకు.. శర్వానంద్ సరసన నటించే ఈ అవకాశం కెరీర్‌లో పెద్ద బ్రేక్‌గా మారొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
మొత్తానికి.. కామెడీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. టాలీవుడ్‌లో ఒక ఫ్రెష్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.









