Search
Close this search box.

  “మహావతార్” నుంచి బిగ్ అప్డేట్..! ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్..!

April 18, 2026 10:37 PM | Aditya369 News

“మహావతార్” నుంచి బిగ్ అప్డేట్..! ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్..!

గత ఏడాది ఇండియన్ బాక్సాఫీస్‌ను అంచనాలకు మించిన స్థాయిలో షాక్ ఇచ్చిన చిత్రం ఏదైనా ఉందంటే అది “మహావతార్ నరసింహా”నే అని చెప్పాలి. పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా, ప్రముఖ నటుల వాయిస్ లేకుండా, భారీ ప్రమోషన్స్ లేకుండానే పూర్తిగా భక్తి నేపథ్యంతో వచ్చిన ఈ యానిమేషన్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది. కేవలం కంటెంట్‌పై నమ్మకంతో ముందుకొచ్చిన మేకర్స్‌కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు.

ఇక ఈ సినిమా సక్సెస్‌తో మేకర్స్ ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను నిర్మించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర అప్డేట్‌ను విడుదల చేశారు. రేపు ఆదివారం ఉదయం 11:22 గంటలకు తమ యూనివర్స్‌లోని కొత్త చాప్టర్ టైటిల్‌ను రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన చిన్న ప్రోమోను విడుదల చేయడంతో సోషల్ మీడియాలో హైప్ మరింత పెరిగింది.

ఇప్పటికే “మహావతార్ పరశురామ” అనే నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా అప్డేట్‌లో దానికి సంబంధించిన ఎలాంటి క్లూ ఇవ్వలేదు. దీంతో ఈ కొత్త అనౌన్స్‌మెంట్ “మహావతార్ నరసింహా”కి సీక్వెల్‌గా ఉంటుందా? లేక పూర్తిగా కొత్త కథతో వస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది.

మొత్తానికి రేపటి అనౌన్స్‌మెంట్ ఏమిటో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే. అభిమానులు మాత్రం భారీ సర్‌ప్రైజ్ కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore