టాలీవుడ్ యువ హీరో నితిన్ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. మరోవైపు, ఒకప్పుడు హిట్ల మెషీన్‌గా పేరుగాంచిన దర్శకుడు శ్రీను వైట్ల కూడా గత కొన్నేళ్లుగా విజయాన్ని అందుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ఒక కొత్త సినిమా చేయబోతున్నారన్న వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
2016 తర్వాత నితిన్ కెరీర్లో ‘భీష్మ’ ఒక్కటే గణనీయమైన విజయం సాధించింది. ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, నితిన్ ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల విషయంలో మరింత జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాడు.
అలాగే శ్రీను వైట్ల విషయానికొస్తే, గతంలో రెడీ, దూకుడు, బాద్ షా వంటి బ్లాక్బస్టర్లు ఇచ్చిన ఆయన, ఇటీవల చేసిన చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘విశ్వం’ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ పరిస్థితుల్లో నితిన్–శ్రీను వైట్ల కాంబినేషన్‌పై ప్రేక్షకులు, ఫ్యాన్స్‌లో మంచి కుతూహలం నెలకొంది..








