Search
Close this search box.

  మళ్లీ వార్తల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, కలకలం రేపుతున్న ఆడియో టేప్‌లు..

October 14, 2024 6:23 PM | Aditya369 News

మళ్లీ వార్తల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, కలకలం రేపుతున్న ఆడియో టేప్‌లు..

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు కాలం కలిసి రాలేదా? ఏదో విధంగా ఆయనను వివాదాలు చుట్టు ముట్టుతున్నాయా? మళ్లీ వార్తల్లోకి రావడానికి కారణమేంటి? తాజాగా ఆడియో టేప్‌లు ఏం చెబుతున్నాయి? దీనిపై మళ్లీ చర్చించుకోవడం ప్రజల వంతైంది.

లేటెస్ట్‌గా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. ఓ మహిళతో మాట్లాడిన ఆడియో టేప్ వెలుగులోకి వచ్చింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు.. పర్సనాలిటీ చాలా బావుందని వ్యాఖ్యానించారు సదరు ఎమ్మెల్యే. ఈ ఆడియో సోషల్‌ మీడియా లో వైరల్ అవుతోంది.

నెల రోజుల కిందట ఎమ్మెల్యే ఆదిమూలం తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ముందుకొచ్చింది. అంతేకాదు ఏకంగా వీడియోలు విడుదలు చేసింది. ఆ వివాదం ముగియకముందే మరో ఆడియోతో వెలుగులోకి వచ్చారు ఎమ్మెల్యే ఆదిమూలం.

సత్యవేడుకు చెందిన టీడీపీకి చెందిన ఓ మహిళా కార్యకర్తను ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయనను టీడీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో బాధిత మహిళను న్యాయస్థానం ముందు హాజరై స్వయంగా వివరణ ఇచ్చుకుంది. ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించిన అంశాలన్నీ అవాస్తమని పేర్కొంది. బాధితురాలితో తాము రాజీకి వచ్చామని కేసు అవసరం లేదని ఎమ్మెల్యే తరపు అడ్వకేట్ న్యాయస్థానం ముందు చెప్పిన విషయం తెల్సిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు