Search
Close this search box.

  బ్లాక్‌బస్టర్ ప్రేమలు సీక్వెల్‌కు బ్రేక్.. ఫ్యాన్స్ డిజప్పాయింట్..!

May 30, 2026 10:49 PM | Aditya369 News

బ్లాక్‌బస్టర్ ప్రేమలు సీక్వెల్‌కు బ్రేక్.. ఫ్యాన్స్ డిజప్పాయింట్..!

మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన రొమాంటిక్ కామెడీ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమలు’ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేరళలో మాత్రమే కాదు, తెలుగులో కూడా ఈ సినిమా భారీ ఆదరణ దక్కించుకుని యువతను విపరీతంగా ఆకట్టుకుంది. నెస్లన్, మమిత బైజు జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు గిరీష్ ఏడి తెరకెక్కించగా, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.

ఈ భారీ విజయంతో ‘ప్రేమలు 2’ కూడా వస్తుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అనౌన్స్‌మెంట్ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్‌లో అనుమానాలు మొదలయ్యాయి.

ఇప్పుడు ఆ అనుమానాలన్నింటికీ హీరో నెస్లన్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ‘ప్రేమలు 2’ ప్రస్తుతం నిలిచిపోయిందని వెల్లడించాడు. స్క్రిప్ట్ అభివృద్ధి దశలోనే కొన్ని కీలక సమస్యలు ఎదురుకావడంతో సినిమా ముందుకు వెళ్లలేకపోయిందని చెప్పాడు.

మొదటి భాగం స్థాయికి తగ్గ కథను సిద్ధం చేయడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తగా మారింది.

‘ప్రేమలు’ సినిమా తన సరదా కథ, సహజమైన ప్రేమకథ, కామెడీతో ప్రేక్షకులను అలరించింది. అందుకే సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు నెస్లన్ ఇచ్చిన ప్రకటనతో ‘ప్రేమలు 2’ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

ఇక మొదటి భాగాన్ని ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ నిర్మించగా, విష్ణు విజయ్ సంగీతం అందించారు. భవిష్యత్తులో కథ పరంగా సరైన ఐడియా దొరికితే ‘ప్రేమలు 2’ మళ్లీ ట్రాక్‌లోకి వస్తుందా లేదా అనేది చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు