దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా తెలుగు సినిమాల గౌరవాన్ని ప్రపంచానికి చాటిన చిత్రం. ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ అప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన టర్నింగ్ పాయింట్ అయింది. “ఎందుకు కట్టప్ప బాహుబలిని చంపాడు?” అనే సస్పెన్స్‌తో దేశం మొత్తం ఊగిపోయింది.
బాహుబలి రెండు భాగాలను కలిపి “Bahubali: The Epic” అనే పేరుతో ఒకే సినిమాగా రీ–ఎడిట్ చేసి విడుదల చేయడానికి రాజమౌళి భారీ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ వెర్షన్‌లో కొన్ని కొత్త సన్నివేశాలు జోడించగా, కొన్ని సీన్స్ తొలగించినట్లు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
బాహుబలి ది ఎపిక్ సినిమా క్లైమాక్స్‌లో రాజమౌళి ఒక పెద్ద సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట!
అదేంటంటే… “Bahubali 3” గురించి అధికారిక ప్రకటన ఉండబోతుందట!
ఈ వార్తలు బయటకు రావడంతో ప్రభాస్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
అయితే ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే, అక్టోబర్ 31 వరకు వేచి చూడాల్సిందే.
రీ–రిలీజ్ కోసం రాజమౌళి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.
త్వరలోనే చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనుంది.
ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
బాహుబలి విజయంతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదిగి, వరుస భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
మరి “బాహుబలి ది ఎపిక్” క్లైమాక్స్‌లో రాజమౌళి ఏమి ప్లాన్ చేశారో తెలుసుకోవడానికి అక్టోబర్ 31 వరకు కౌంట్‌డౌన్ మొదలైంది..








