Search
Close this search box.

  బాలయ్య-గోపీచంద్ మూవీ లో ట్విస్ట్..! హీరోయిన్ చేంజ్..?

April 20, 2026 11:13 PM | Aditya369 News

బాలయ్య-గోపీచంద్ మూవీ లో ట్విస్ట్..! హీరోయిన్ చేంజ్..?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ బిజీగా ఉన్నారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ’ సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడంతో, తన తదుపరి ప్రాజెక్ట్‌పై బాలయ్య మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలపబోతున్న విషయం తెలిసిందే.

నయనతార తప్పుకున్నట్లు వార్తలు…

మొదట ఈ సినిమాను పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించాలని భావించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల కథలో పెద్ద మార్పులు చేసినట్లు సమాచారం. ఈ మార్పుల కారణంగా హీరోయిన్‌గా ఎంపికైన నయనతార ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో బాలయ్యకు జోడిగా ఎవరు నటిస్తారనే ఆసక్తి పెరిగింది.

కాజల్ అగర్వాల్ ఎంట్రీ…

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. నయనతార స్థానంలో కాజల్‌ను సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. త్వరలోనే ఆమె షూటింగ్‌లో జాయిన్ అవుతారని సమాచారం. బాలకృష్ణ–కాజల్ జంట ఇప్పటికే ‘భగవంత్ కేసరి’లో కనిపించి మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ దృష్ట్యా గోపీచంద్ మలినేని ఈ కాంబినేషన్‌ను మళ్లీ రిపీట్ చేయాలని భావించినట్లు తెలుస్తోంది.

‘కురుక్షేత్ర’ టైటిల్ చర్చల్లో…

ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ సూపర్ హిట్ కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై కూడా భారీ హైప్ ఏర్పడింది. ఇక ఈ సినిమా కోసం ‘కురుక్షేత్ర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో బాలకృష్ణ, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా సిద్ధమవుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore