Search
Close this search box.

  బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్.. ?

May 8, 2026 11:30 AM | Aditya369 News

బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్.. ?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటసింహం గా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ.. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత జోష్‌తో సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఆరుపదుల వయసు దాటినా కూడా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయిన బాలయ్య.. ఒకవైపు రాజకీయాల్లో హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తూనే, మరోవైపు సినిమాల్లో మాస్ యాక్షన్‌తో థియేటర్లను షేక్ చేస్తున్నారు. ముఖ్యంగా డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటూ తన ఎనర్జీతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 111 సినిమాతో మరోసారి అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశారు.

బాలయ్య కోసం రంగంలోకి బాలీవుడ్ బ్యూటీ..

ఇప్పటికే బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన “వీరసింహారెడ్డి” బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలయ్య యాక్షన్, డైలాగ్ డెలివరీ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. దీంతో ఇప్పుడు వస్తున్న NBK 111 పై కూడా భారీ హైప్ ఏర్పడింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఓ ప్రత్యేక మాస్ సాంగ్ ప్లాన్ చేశారట. ఆ పాట కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీని తీసుకొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో “వీరసింహారెడ్డి”లో చంద్రికా రవి చేసిన స్పెషల్ సాంగ్ ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఇప్పుడు అదే రేంజ్‌లో, మరింత గ్రాండ్‌గా ఈ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

హైదరాబాదులో భారీ సెట్..

బాలయ్య – నర్గీస్ ఫక్రీపై తెరకెక్కించే ఈ స్పెషల్ సాంగ్ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా భారీ సెట్ వేసినట్లు సమాచారం. అంతేకాదు, ఈ పాట షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య మాస్ స్టెప్స్‌కి నర్గీస్ గ్లామర్ జతకావడంతో ఈ సాంగ్ థియేటర్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా “ఈ కాంబో స్క్రీన్‌పై ఫైర్ క్రియేట్ చేస్తుంది” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

బాలయ్య తదుపరి ప్రాజెక్టులు..

ఇక బాలయ్య రాబోయే సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో NBK 112 ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్‌ను తీసుకోవాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

గతంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్ – బసవతారకం పాత్రల్లో బాలయ్య, విద్యాబాలన్ కలిసి నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ హిట్ జోడిని తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మరి ఈ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore