నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మాస్ ఎనర్జీ, గోపీచంద్ స్టైలిష్ టేకింగ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే ఫార్ములా అని సినిమా యూనిట్ నమ్ముతోంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.
బాలకృష్ణ సినిమాల్లో స్పెషల్ డ్యాన్స్ సాంగ్ ఉంటే ఆ సినిమా రేంజ్ మరో లెవెల్‌కు వెళ్లడం ఒక సెంటిమెంట్‌గా మారింది. ఇదే సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని గోపీచంద్ మలినేని ఈ చిత్రంలో కూడా ఒక ఎలక్ట్రిఫైయింగ్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, ఈ స్పెషల్ సాంగ్ కోసం స్టార్ బ్యూటీ తమన్నా భాటియాను ఎంపిక చేశారన్న వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
తమన్నా స్పెషల్ సాంగ్స్‌కు ప్రేక్షకుల్లో ఎక్స్‌ట్రా హైప్ ఉంటుంది. గతంలో ఆమె ‘అల్లుడు శ్రీను’, ‘జై లవకుశ’, ‘కేజీఎఫ్ 2’, ‘జైలర్’ వంటి చిత్రాల్లో చేసిన స్పెషల్ సాంగ్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. ఆమె ఎనర్జీ, డ్యాన్స్‌కి బాలయ్య ఎనర్జీ తోడైతే సిల్వర్ స్క్రీన్ షేక్ కావడం ఖాయమనే చెప్పాలి. ఈ చిత్రంలో బాలయ్య రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించనున్నారని సమాచారం.









