Search
Close this search box.

  బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న “మహావతార్ నరసింహ”..! 8 రోజుల్లోనే..

August 5, 2025 8:52 AM | Aditya369 News

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న “మహావతార్ నరసింహ”..! 8 రోజుల్లోనే..

పెద్ద స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లు, భారీ సెట్లు… ఇవన్నీ లేకుండానే ఒక సినిమా హిట్ కావచ్చు అని మరోసారి నిరూపించింది మహావతార్ నరసింహ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ యానిమేటెడ్ మూవీ, కంటెంట్‌ బలం మీదనే థియేటర్లలో దుమ్మురేపుతోంది. ప్రేక్షకులు మాటామాటకూ ఈ సినిమాను రికమెండ్ చేస్తూ, హౌస్‌ఫుల్ షోలకు కారణమవుతున్నారు.

8 రోజుల్లోనే 60 కోట్ల క్లబ్‌లోకి

హోంబలే ఫిల్మ్స్ వెల్లడించిన ప్రకారం, మహావతార్ నరసింహ కేవలం 8 రోజుల్లో రూ. 60.5 కోట్లకు పైగా వసూలు చేసి, భారతీయ యానిమేటెడ్ సినిమాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది.

> “అన్ని రికార్డులను చెరిపేసి, కేవలం 8 రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకుంది” – హోంబలే ఫిల్మ్స్ ట్వీట్.

అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, మహా విష్ణువు దశావతారాల ఆధారంగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌లో మొదటి అధ్యాయం. ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ పేరుతో మేకర్స్‌ వచ్చే 10 ఏళ్లలో ప్రతి ఏడాది ఒక సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే ప్రకటించారు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు