ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో తన 22వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ‘పుష్ప 2’ తర్వాత బన్నీ తన తదుపరి ప్రాజెక్టులను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘AA 22’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 70% చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం.
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ బయటకు రాకుండా దర్శకుడు అట్లీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే అభిమానులు మాత్రం అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ రోజు సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. మరికొంతమంది హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ, చిత్రబృందం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ కాంబినేషన్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించబడింది. ఆ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు..









