టాలీవుడ్లో ఒకప్పుడు లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న క్యూట్ బ్యూటీ కృతి శెట్టి కెరీర్ ఇప్పుడు ముగిసిపోయిందా అనే చర్చలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి. శర్వానంద్‌తో నటించిన సినిమా తర్వాత ఆమెకు టాలీవుడ్లో అవకాశాలు దాదాపు తగ్గిపోయాయి.
మొదటి మూడు సినిమాలతో వరుస విజయాలు అందుకున్న కృతి శెట్టి, ఆ తర్వాత మాత్రం ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది. దీంతో ఆమె కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోవడంతో ఇతర భాషల్లో ప్రయత్నించినా అక్కడ కూడా ఆశించిన ఫలితం దక్కలేదు.
అయితే ఇప్పుడు కృతి శెట్టి కెరీర్‌కు మళ్లీ లైఫ్ ఇచ్చేలా ఒక మంచి అవకాశం వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి, తన తర్వాతి ప్రాజెక్ట్‌ను వెంకటేష్ మరియు కళ్యాణ్ రామ్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, నటీనటుల ఎంపికలో ఆయన బిజీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో హీరోయిన్గా కృతి శెట్టి పేరును పరిశీలిస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్‌కు జోడిగా కృతి శెట్టి నటించనుందని అంటున్నారు.
ఒకవేళ ఈ అవకాశం నిజమైతే, కృతి శెట్టి కెరీర్‌కు ఇది బిగ్ బ్రేక్ అవుతుందని చెప్పాలి. టాలీవుడ్లో మళ్లీ తన స్థానం సంపాదించుకునే ఛాన్స్ ఆమెకు దొరికినట్టే..








