Search
Close this search box.

  ప్రశాంత్ నీళ్ మాస్టర్ ప్లాన్..! సలార్ 2 తో బాక్సాఫీస్ షేక్..

April 20, 2026 11:20 PM | Aditya369 News

ప్రశాంత్ నీళ్ మాస్టర్ ప్లాన్..! సలార్ 2 తో బాక్సాఫీస్ షేక్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్ట్‌లతో తన రేంజ్‌ను మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు పవర్‌ఫుల్ యాక్షన్‌ను బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన, ‘కేజీఎఫ్’ చిత్రాలతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి చేసిన ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా రాబోతున్న ‘సలార్ పార్ట్ 2: శౌర్యంగ పర్వం’పై ఇండస్ట్రీలో భారీ చర్చ నడుస్తోంది. మధ్యలో ఈ కాంబో మరో కొత్త కథతో వస్తుందని వార్తలు వచ్చినా, తాజా సమాచారం ప్రకారం సీక్వెల్ ఖచ్చితంగా తెరకెక్కనుందని తెలుస్తోంది.

సీక్వెల్‌పై భారీ అంచనాలు

మొదటి భాగం చివర్లో ఇచ్చిన క్లూస్ ఆధారంగా ‘శౌర్యంగ పర్వం’ కథపై ఇప్పటికే ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా శౌర్యంగ తెగ నేపథ్యం, పాత్రల మధ్య ఉండే ఘర్షణలను మరింత ఇంటెన్స్‌గా చూపించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొదటి భాగాన్ని మించిన యాక్షన్, ఎమోషన్‌తో ఈ సీక్వెల్‌ను గ్రాండ్‌గా రూపొందించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. దీంతో ఫ్యాన్స్ అంచనాలు రెట్టింపు అయ్యాయి.

షూటింగ్ ఎప్పుడంటే…

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రభాస్ ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ సినిమాలతో షెడ్యూల్ ఫుల్‌గా ఉంది. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయ్యాకే ఇద్దరూ ‘సలార్ 2’ సెట్స్‌లోకి వెళ్లే అవకాశముంది. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే 2027 ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈలోపు ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి, ఈ ఏడాది చివర్లో అధికారిక అనౌన్స్‌మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని టాక్.

మేకర్స్ గ్రాండ్ ప్లాన్

‘శౌర్యంగ పర్వం’లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య సాగే ఆధిపత్య పోరును మరింత ఉత్కంఠభరితంగా చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎక్కడా రాజీ పడకుండా హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కించాలనే ఉద్దేశంతో మేకర్స్ ముందుకు వెళ్తున్నారు.

మొత్తానికి, ‘సలార్ పార్ట్ 1’ సృష్టించిన సంచలనానికి మించిన స్థాయిలో ‘సలార్ పార్ట్ 2’ ఉండబోతుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఈ సీక్వెల్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందన్నదానిపై ఉంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore