Search
Close this search box.

  పెద్ది రిలీజ్‌పై పెద్ద ట్విస్ట్…! నిజం బయటపెట్టిన చరణ్..!

April 1, 2026 10:51 PM | Aditya369 News

పెద్ది రిలీజ్‌పై పెద్ద ట్విస్ట్…! నిజం బయటపెట్టిన చరణ్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ‘పెద్ది’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం చివరి దశలో ఉండగా, మొదటగా ఏప్రిల్ 30న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. జూన్ 26కి రిలీజ్ మార్చారని వస్తున్న రూమర్స్‌తో అభిమానులు అయోమయంలో పడ్డారు. ఇదే సమయంలో ఇతర సినిమాల నిర్మాతలు కూడా ‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు.

చెల్లెలి సినిమా కోసం చరణ్ సపోర్ట్

ఇలాంటి పరిస్థితుల్లో, తన చెల్లెలు Niharika Konidela నిర్మాతగా తెరకెక్కిస్తున్న ‘రాకాసా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడుదలైన ఇంటర్వ్యూ ప్రోమోలో ‘పెద్ది’ సినిమా గురించి కూడా ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది.

‘పెద్ది’ లేట్ అవ్వట్లేదు!

ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ – ‘పెద్ది సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారు. సినిమా ఎక్కడా లేట్ అవ్వట్లేదు… ఈ విషయాన్ని బాగా ప్రచారం చేయండి’ అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సినిమా వాయిదా పడదని, అనుకున్నట్లుగానే ఏప్రిల్ 30న రిలీజ్ అవుతుందని ఆశిస్తున్నారు. చరణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

‘రాకాసా’పై చరణ్ ప్రశంసలు

ఇక ఈ ఇంటర్వ్యూ పూర్తి వీడియో త్వరలో విడుదల కానుంది. ఇందులో చరణ్ ‘పెద్ది’ గురించి మరిన్ని విషయాలు చెప్పే అవకాశం ఉంది. అలాగే ‘రాకాసా’ సినిమా గురించి మాట్లాడిన చరణ్, అందులోని స్నేక్ సాంగ్ చాలా బాగుందని ప్రశంసించారు.

ఈ సినిమా ఫాంటసీ హారర్-కామెడీ జానర్‌లో తెరకెక్కుతోంది. దర్శకుడు మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలు పెంచాయి.‘రాకాసా’ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుండగా, ఏప్రిల్ 2 సాయంత్రం ప్రీమియర్లు ప్రదర్శించనున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు