Search
Close this search box.

  పెద్ది రన్‌టైమ్ వింటే షాక్ అవ్వాల్సిందే.. బుచ్చిబాబు ప్లాన్ మామూలు కాదు..!

May 8, 2026 10:20 PM | Aditya369 News

పెద్ది రన్‌టైమ్ వింటే షాక్ అవ్వాల్సిందే.. బుచ్చిబాబు ప్లాన్ మామూలు కాదు..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. గ్రామీణ క్రీడల నేపథ్యంతో దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక జూన్ 4న సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. ఇప్పుడు ఈ మూవీ రన్‌టైమ్ గురించే సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘పెద్ది’ మూవీ నిడివి దాదాపు 3 గంటల 20 నిమిషాల వరకు ఉండబోతుందట. ఇదే ఇప్పుడు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఎందుకంటే గత కొంతకాలంగా భారీ రన్‌టైమ్‌తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘RRR’, ‘పుష్ప 2’ వంటి చిత్రాలు ఎక్కువ నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షకులను పూర్తిగా ఎంగేజ్ చేశాయి. అందుకే ఇప్పుడు ‘పెద్ది’ కూడా కంటెంట్ బలంగా ఉంటే మరో ఇండస్ట్రీ హిట్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 17న భారీ స్థాయిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇందోర్ లేదా పాట్నాలో ఈ ఈవెంట్ జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. భారీ జన సమూహం మధ్య ట్రైలర్ విడుదల చేసి సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలని టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు జూన్ 2న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే విడుదలకు ముందే ‘పెద్ది’ ఓవర్సీస్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. అమెరికాలో జూన్ 3న గ్రాండ్ ప్రీమియర్స్ ప్లాన్ చేయగా.. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది సేపటికే భారీ రెస్పాన్స్ వచ్చింది. కేవలం 30 నిమిషాల్లోనే 50 వేల డాలర్లకు పైగా ప్రీ సేల్స్ నమోదు కాగా.. నాలుగు గంటల్లోనే లక్ష డాలర్ల మార్క్‌ను దాటేసిందట. అంతేకాదు.. అత్యంత వేగంగా భారీ టికెట్ సేల్స్ నమోదు చేసిన చిత్రాల్లో ఒకటిగా ‘పెద్ది’ ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి విడుదలకు ముందే ‘పెద్ది’ క్రేజ్ చూస్తుంటే.. రామ్ చరణ్ కెరీర్‌లో మరో భారీ బ్లాక్‌బస్టర్ రావడం ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో బలంగా వినిపిస్తోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore