గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి అభిమానులను ఉర్రూతలూగించే అప్‌డేట్ వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఫ్యాన్స్‌లో మరింత హైప్‌ను పెంచుతోంది.
‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలు, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకు, ఒక రోజు ముందుగానే అంటే జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేశారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుండగా, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, ప్రముఖ నటుడు జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.









