Search
Close this search box.

  ‘పెద్ది’ జూన్ 26 ఫిక్సా..? నిర్మాత వ్యాఖ్యలతో ట్విస్ట్..!

March 30, 2026 11:52 PM | Aditya369 News

‘పెద్ది’ జూన్ 26 ఫిక్సా..? నిర్మాత వ్యాఖ్యలతో ట్విస్ట్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీపై నెలకొన్న అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. మొదట ఏప్రిల్ 30న విడుదల అవుతుందని భావించిన ఈ చిత్రం, తాజాగా జూన్ 26కు వాయిదా పడిందనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.

ఇటీవల ఒక కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. తమ ‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమాను జూన్ 26న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నామని, కానీ అదే తేదీన ‘పెద్ది’ రానున్నట్లు తెలిసి తమ చిత్రాన్ని వాయిదా వేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో ‘పెద్ది’ జూన్ 26 రిలీజ్ దాదాపు ఖరారైనట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని కూడా ఆయన సూచించడం గమనార్హం.

ఇక ఈ పరిస్థితి ఇతర సినిమాల విడుదల తేదీలపై కూడా ప్రభావం చూపుతోంది. ఏప్రిల్ 30న ‘పెద్ది’ విడుదల అవుతుందని భావించి అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ చిత్రాన్ని జూన్ 26కు మార్చారు. ఇప్పుడు ‘పెద్ది’ అదే తేదీకి వాయిదా పడుతుందనే వార్తలతో ‘లెనిన్’ మళ్లీ పాత తేదీకి వస్తుందా అన్న చర్చ మొదలైంది. మరోవైపు, ఏప్రిల్ 30న ధనుష్ నటిస్తున్న ‘కర’, అలాగే ‘కేడీ: ది డెవిల్’ వంటి చిత్రాలు కూడా పోటీలో నిలుస్తున్నాయి.

మొత్తంగా ‘పెద్ది’ సినిమా రిలీజ్ డేట్‌పై కొనసాగుతున్న ఈ అయోమయం ఇండస్ట్రీ మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది. ఇక ఈ గందరగోళానికి తెరపడాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందేనని అభిమానులు, సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు