హోంబలె ఫిల్మ్స్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్‌తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన ఈ నిర్మాణ సంస్థ.. ఇప్పుడు మరో భారీ అడుగు వేసింది. ఇకపై కేవలం సినిమాల నిర్మాణమే కాదు.. అంతర్జాతీయ పంపిణీ రంగంలో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమైంది.
ఆ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తమ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ జర్నీకి తొలి చిత్రంగా రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ని ఎంపిక చేయడం. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా రేంజ్ మరింత పెరిగిపోయిందనే చర్చ మొదలైంది. భారతీయ కథలను ప్రపంచవ్యాప్తంగా మరింత గ్రాండ్‌గా తీసుకెళ్లాలనే లక్ష్యంతో హోంబలే ఈ కొత్త విభాగాన్ని ప్రారంభిస్తోంది. అందులో మొదటి అడుగే ‘పెద్ది’ కావడం మెగా అభిమానులకు మరింత స్పెషల్‌గా మారింది.
ఇప్పటికే దర్శకుడు బుచ్చి బాబు సాన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్, గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన పవర్‌ఫుల్ పోస్టర్లు సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేశాయి. ఇక ఆస్కార్ విజేత A. R. రెహమాన్ సంగీతం అందిస్తుండటం మరో పెద్ద ప్లస్‌గా మారింది.
ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ నేరుగా ఓవర్సీస్ రిలీజ్ బాధ్యతలు తీసుకోవడంతో.. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్ వంటి కీలక మార్కెట్లలో ‘పెద్ది’ భారీ స్థాయిలో విడుదల కానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తానికి.. రామ్ చరణ్ కెరీర్‌లో ‘పెద్ది’ మరో గేమ్ ఛేంజర్ మూవీగా మారబోతోందని అభిమానులు నమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.









