Search
Close this search box.

  పెద్ది కలెక్షన్ల సునామీ.. మరో రికార్డు సొంతం..!

June 7, 2026 8:20 PM | Aditya369 News

పెద్ది కలెక్షన్ల సునామీ.. మరో రికార్డు సొంతం..!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.236.7 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డుల వేట కొనసాగిస్తోంది.

సినిమా విడుదలైన తొలి రోజే రూ.135.36 కోట్ల భారీ గ్రాస్‌ను అందుకుని గ్రాండ్ ఓపెనింగ్ సాధించింది. రెండో రోజు ముగిసే సమయానికి వసూళ్లు రూ.181.8 కోట్లకు చేరుకోగా, మూడో రోజు కూడా అదే ఊపు కొనసాగించి మొత్తం రూ.236.7 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ‘బాక్సాఫీస్ ఛాంపియన్ పెద్ది – అన్‌స్టాపబుల్’ అనే ట్యాగ్‌తో ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.

థియేటర్లలో భారీ స్పందన దక్కించుకుంటున్న ఈ చిత్రం, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌లోనూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లు బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో కలిపి ఇప్పటికే 4 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

వారాంతంలో అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేసిన ‘పెద్ది’, రాబోయే రోజుల్లో మరిన్ని బాక్సాఫీస్ మైలురాళ్లను అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు