Search
Close this search box.

  ‘పెద్ది’ ఓటీటీపై వైరల్ వార్తలకు చెక్..! అసలు డేట్ ఇదేనా..?

June 30, 2026 10:21 PM | Aditya369 News

‘పెద్ది’ ఓటీటీపై వైరల్ వార్తలకు చెక్..! అసలు డేట్ ఇదేనా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా భారీ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జూలై 2 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందనే ప్రచారం వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ సినీ వర్గాల సమాచారం ప్రకారం, ‘పెద్ది’ జూలై 2న కాదు... జూలై 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తోంది. అంటే థియేటర్లలో విడుదలైన దాదాపు 42 రోజుల తర్వాత డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగానే కుదిరిన ఒప్పందం ప్రకారమే ఈ ఓటీటీ విండోను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

ఇప్పటికే థియేటర్ రన్ చివరి దశకు చేరుకున్నప్పటికీ, వీకెండ్స్‌లో ‘పెద్ది’ ఇంకా మంచి వసూళ్లనే రాబడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విడుదలై మూడు వారాలు దాటినా ప్రేక్షకుల నుంచి స్పందన కొనసాగుతుండటం విశేషంగా మారింది.

ప్రస్తుతం చాలా సినిమాలు నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడంపై ప్రభావం పడుతోందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే కనీసం 40 నుంచి 50 రోజుల గ్యాప్‌తో ఓటీటీ రిలీజ్ చేయడం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, మొత్తం ఇండస్ట్రీకి ప్రయోజనకరంగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు ‘పెద్ది’ రూ.500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అభిమానులు ఆశించినప్పటికీ, ఓవర్సీస్‌తో పాటు ఉత్తరాది మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో ఆ లక్ష్యం కాస్త కష్టంగా మారినట్లు తెలుస్తోంది. ఇక సినిమా ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత వద్ద ముగుస్తాయో మరో కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా భారీ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జూలై 2 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందనే ప్రచారం వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ సినీ వర్గాల సమాచారం ప్రకారం, ‘పెద్ది’ జూలై 2న కాదు… జూలై 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తోంది. అంటే థియేటర్లలో విడుదలైన దాదాపు 42 రోజుల తర్వాత డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగానే కుదిరిన ఒప్పందం ప్రకారమే ఈ ఓటీటీ విండోను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

ఇప్పటికే థియేటర్ రన్ చివరి దశకు చేరుకున్నప్పటికీ, వీకెండ్స్‌లో ‘పెద్ది’ ఇంకా మంచి వసూళ్లనే రాబడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విడుదలై మూడు వారాలు దాటినా ప్రేక్షకుల నుంచి స్పందన కొనసాగుతుండటం విశేషంగా మారింది.

ప్రస్తుతం చాలా సినిమాలు నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడంపై ప్రభావం పడుతోందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే కనీసం 40 నుంచి 50 రోజుల గ్యాప్‌తో ఓటీటీ రిలీజ్ చేయడం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, మొత్తం ఇండస్ట్రీకి ప్రయోజనకరంగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు ‘పెద్ది’ రూ.500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అభిమానులు ఆశించినప్పటికీ, ఓవర్సీస్‌తో పాటు ఉత్తరాది మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో ఆ లక్ష్యం కాస్త కష్టంగా మారినట్లు తెలుస్తోంది. ఇక సినిమా ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత వద్ద ముగుస్తాయో మరో కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు