Search
Close this search box.

  ‘పెద్ది’ ఎఫెక్ట్.. ‘లెనిన్’ కొత్త రిలీజ్ డేట్..!

March 28, 2026 11:15 PM | Aditya369 News

‘పెద్ది’ ఎఫెక్ట్.. ‘లెనిన్’ కొత్త రిలీజ్ డేట్..!

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘లెనిన్’ సినిమా విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. మొదట మే 1న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కొత్త విడుదల తేదీగా జూన్ 26ను ఖరారు చేస్తూ, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆ రోజే ప్రేక్షకుల ముందుకు రానుంది అని వెల్లడించింది.

ఈ సందర్భంగా ‘లెనిన్’ టీమ్ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన తేదీకి సినిమా రాకపోవడానికి కారణాన్ని కూడా వారు వివరించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుండటంతో, ఇండస్ట్రీలో పరస్పర గౌరవం దృష్ట్యా తమ సినిమాను వాయిదా వేసినట్లు తెలిపారు.

రామ్ చరణ్, అఖిల్ మధ్య ఉన్న మంచి అనుబంధాన్ని గుర్తుచేస్తూ, ఆరోగ్యకరమైన వాతావరణంలో సినిమాలను సెలబ్రేట్ చేసుకోవాలని భావించామని పేర్కొన్నారు. అభిమానులకు మంచి సినిమాటిక్ అనుభూతిని అందించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

‘లెనిన్’ అన్ని రకాల భావోద్వేగాలతో నిండిన పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని, అత్యుత్తమంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్రబృందం హామీ ఇచ్చింది.

అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 26న ఈ చిత్రం ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore