మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ సాంగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యిందని సమాచారం. ఇక షూటింగ్ పూర్తికాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరగనున్నాయి. ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట ఏప్రిల్ 30న రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడి జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఖచ్చితమైన విడుదల తేదీపై ఇంకా క్లారిటీ లేదు.
జూన్ 25న విడుదల
ఇటీవల జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో డైరెక్టర్ బుచ్చి బాబు సాన మాట్లాడుతూ పెద్ది జూన్ 25న రిలీజ్ అయ్యే అవకాశముందని చెప్పారు. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. దీంతో అభిమానులు రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మూడు షేడ్స్‌లో చరణ్?
ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక పాత్ర, కుస్తీ పోటీల నేపథ్యంలో మరో పాత్ర కనిపించబోతున్నట్టు టీజర్ ద్వారా ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు మూడో పాత్ర కూడా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోల్ ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఎలిమెంట్‌గా ఉండబోతుందని టాక్.
రిలీజ్ డేట్‌పై క్లాష్ చర్చ
ఇక యశ్ హిరోగా వస్తున్న టాక్సిక్ సినిమా వాయిదా పడటంతో, పెద్దిని జూన్ 4న రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. అదే సమయంలో జూన్ 25 రిలీజ్ అయితే, తదుపరి రోజు విడుదలయ్యే అఖిల్ సినిమాతో క్లాష్ అయ్యే అవకాశముంది. అందుకే జూన్ 4నే పర్ఫెక్ట్ డేట్ అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడంతా ఒక్కటే ప్రశ్న—పెద్ది టీమ్ ఏ తేదీని ఫిక్స్ చేస్తుంది? అభిమానుల అంచనాలకు సరిపోయేలా ప్లాన్ చేస్తారా? అన్నది చూడాలి.








