ఒకప్పుడు తెలుగు సినిమా ₹100 కోట్ల మార్క్ దాటుతుందా అన్న సందేహాల నుంచి… నేడు కేవలం OTT హక్కుల ద్వారానే ₹100 కోట్లకు పైగా వసూలు చేసే స్థాయికి ఎదిగింది. ఈ మార్పు టాలీవుడ్ రేంజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తూ, రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా భారీ డీల్‌తో వార్తల్లో నిలుస్తోంది.
‘ఉప్పెన’తో సెన్సేషనల్ హిట్ ఇచ్చిన బుచ్చి బాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాకు వస్తున్న బిజినెస్ డీల్స్ చూస్తుంటే ట్రేడ్ వర్గాలకే షాక్ అవుతోంది.
షూటింగ్‌లోనే భారీ OTT డీల్
సాధారణంగా సినిమా రిలీజ్ తర్వాతే OTT డీల్స్ ఫైనల్ అవుతాయి. కానీ ‘పెద్ది’ మాత్రం షూటింగ్ స్టేజ్‌లో ఉండగానే రికార్డు స్థాయి డీల్‌ను క్లోజ్ చేసిందని సమాచారం. ప్రముఖ ప్లాట్‌ఫామ్ Netflix ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా ₹130 కోట్ల ఆఫర్ ఇచ్చిందట.
ఈ డీల్ కేవలం సౌత్ భాషలకే కాకుండా హిందీ మార్కెట్‌ను కూడా కవర్ చేస్తోంది. RRR తర్వాత నార్త్ ఇండియాలో రామ్ చరణ్‌కు పెరిగిన క్రేజ్, అలాగే ‘ఉప్పెన’తో బుచ్చిబాబు సన వంద కోట్ల క్లబ్‌లో చేరడం—ఇవే ఈ భారీ డీల్‌కు ప్రధాన కారణాలంటూ టాక్ వినిపిస్తోంది.
సక్సెస్ బోనస్‌తో మరో ట్విస్ట్
ఇది ₹130 కోట్లతో ఆగిపోలేదు. సినిమా థియేటర్లలో సాధించే విజయాన్ని బట్టి మరో ₹20 కోట్ల వరకు ‘సక్సెస్ ఇన్సెంటివ్’ కూడా ఇవ్వనున్నారట. అంటే ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తే మొత్తం డిజిటల్ డీల్ విలువ ₹150 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఓటీటీ హిస్టరీలోనే ఇది చాలా అరుదైన అగ్రిమెంట్‌గా చెప్పుకుంటున్నారు.
డ్యూయల్ రోల్స్‌తో చరణ్
ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారని సమాచారం. ఒకటి రా అండ్ రస్టిక్ ‘పెద్ది పహిల్వాన్’ పాత్ర కాగా… మరొకటి ఆధునిక క్రికెటర్ పాత్ర. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఈ రెండు పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ జర్నీనే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.
ఇక కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తుండగా… మలయాళ నటుడు ఆంటోనీ కూడా పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నారు.
మ్యూజిక్ & గ్లామర్ అదనపు ఆకర్షణ
ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా… హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
రిలీజ్‌పై క్లారిటీ ఎప్పుడు?
మేకర్స్ ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్ ఉన్నా… అధికారిక క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్‌లో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. అయితే రిలీజ్‌కు ముందే ‘పెద్ది’ సెట్ చేస్తున్న రికార్డులు చూస్తుంటే… థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయోనని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.









