డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ నటుడు విజయ్ సేతుపతి తొలిసారి కలసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ #పూరిసేతుపతిపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్కి చెందిన జెబి నారాయణరావు కొండ్రోల్లా, పూరి కనెక్ట్స్ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా మేకర్స్ భారీ అప్డేట్ ఇచ్చారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 28న టైటిల్‌తో పాటు టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, టబు, విజయ్ కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ట్రూ పాన్-ఇండియా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న #పూరిసేతుపతి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..








