పుష్పలో శ్రీవల్లిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న… ఇప్పుడు మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ “రాకా”లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా మరో క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఆమె ఒక్కరే కాదు… మరో నలుగురు హీరోయిన్లు కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఆ జాబితాలో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ తమకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసినట్లు సమాచారం.
ఇక ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా “రాకా” షూటింగ్‌లో జాయిన్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది.
‘పుష్ప’ తర్వాత మరోసారి అల్లు అర్జున్–రష్మిక జోడీ ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఈ సినిమాలో రష్మిక పాత్ర ఏమిటి? బన్నీతో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై మాత్రం మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మొత్తానికి… ఈ వార్త నిజమైతే, మరోసారి బన్నీ–రష్మిక జోడీ మ్యాజిక్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది.









