Search
Close this search box.

  పవన్ కళ్యాణ్ OG ప్రీక్వెల్‌లో మల్టీ స్టార్ కాస్ట్… బిగ్ ప్లాన్ లీక్..!

April 16, 2026 12:01 AM | Aditya369 News

పవన్ కళ్యాణ్ OG ప్రీక్వెల్‌లో మల్టీ స్టార్ కాస్ట్… బిగ్ ప్లాన్ లీక్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే… మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ… ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.

అలా ఆయన కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచిన సినిమా అంటే ‘ఓజీ’ అని చెప్పాలి. సరైన సమయంలో సరైన కథతో వచ్చిన ఈ సినిమా… ముఖ్యంగా జెన్-జీ ఆడియన్స్‌ను పవన్ కళ్యాణ్ వైపు మళ్లీ ఆకర్షించింది. ఈ మూవీతో యువతలో ఆయనకు కొత్త క్రేజ్ ఏర్పడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్నప్పటికీ… సోషల్ మీడియాలో మాత్రం ‘ఓజీ’ హంగామా కొనసాగుతోంది. సినిమాలోని సీన్స్‌ను తీసుకుని క్రికెట్ అభిమానులు తమకు నచ్చిన విధంగా ఎడిట్స్ చేసి వైరల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్‌లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. కథ పరంగా పెద్దగా హైలైట్ కాకపోయినా… పవన్ కళ్యాణ్‌కు ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఉన్నాయి.

ఇలాంటి ఇంపాక్ట్ ఇచ్చిన దర్శకుడు సుజీత్… ఇప్పుడు ‘ఓజీ’ యూనివర్స్‌ను మరింత విస్తరించే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. రెండో భాగంతో ఇంకా భారీగా పవన్ కళ్యాణ్‌ను ఎలివేట్ చేయాలని చూస్తున్నారట. అంతేకాదు… ఈ కథను ఒక పెద్ద ఫ్రాంచైజీగా మలచాలని కూడా నిర్ణయించుకున్నారు.

మొదటి భాగం క్లైమాక్స్‌లోనే ‘ఓజీ 2’కి సంబంధించిన హింట్స్ ఇచ్చిన సుజీత్… ఈ యూనివర్స్‌లో సీక్వెల్, ప్రీక్వెల్ రెండూ ఉంటాయని అప్పుడే ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఈ సినిమాలను కేవలం తన కెరీర్‌కే కాదు… ఇండియన్ సినిమా స్థాయిలో ఒక భారీ ఈవెంట్‌గా నిలబెట్టాలని సుజీత్ ప్లాన్ చేస్తున్నారట.

అందులో భాగంగానే ముందుగా ‘ఓజీ’ ప్రీక్వెల్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. సినిమాలో పవన్ కళ్యాణ్ కూతురు “ఓజీ అంటే ఏంటి?” అని అడిగే సన్నివేశం గుర్తుండే ఉంటుంది. అక్కడినుంచే ఈ ప్రీక్వెల్ స్టోరీ స్టార్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.

ఈ ప్రీక్వెల్‌లో ఓజాస్ గంభీర తండ్రి ఆజాద్ బ్యాక్‌స్టోరీని చూపించబోతున్నారు. ఆజాద్‌కు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో ఉన్న అనుబంధం కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఆ పాత్రలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

ఇంకా ‘ఓజీ’లోని మధురై పోలీస్ స్టేషన్ సీన్‌లో పవన్ కళ్యాణ్ బ్యాగ్‌లో సుభాష్ చంద్రబోస్ గెటప్‌లో కనిపించే ఫోటో గుర్తుంటే… అదే ఈ ప్రీక్వెల్‌కు హింట్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంటే రామ్ చరణ్ ఎంట్రీ దాదాపు ఖాయమే అన్నమాట.

అంతేకాదు… సత్య దాదా, సాహూ ఫ్యామిలీ లింక్‌ను బేస్ చేసుకుని ప్రీక్వెల్‌లో ప్రభాస్ పాత్ర కూడా ఉండే అవకాశముంది. అలాగే నాని కూడా ఈ యూనివర్స్‌లో భాగం అవుతారని టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి ‘ఓజీ’ ప్రీక్వెల్‌ను మల్టీ స్టార్ యూనివర్స్‌గా తెరకెక్కించే ప్లాన్‌లో సుజీత్ ఉన్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే… ఇండియన్ సినిమాలో మరో భారీ ఫ్రాంచైజీకి ఇది శ్రీకారం కావడం ఖాయం.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు