Search
Close this search box.

  నాని నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో రుక్మిణి వసంత్..?

June 12, 2026 10:18 PM | Aditya369 News

నాని నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో రుక్మిణి వసంత్..?

టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా ఓ ఇంట్రెస్టింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడని కొన్ని సినిమాలు.. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. "ఇంత మంచి సినిమాను థియేటర్లలో ఎందుకు మిస్ అయ్యామా?" అంటూ ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి. అలాంటి కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చిత్రాల్లో గతేడాది వచ్చిన 'దండోరా' ఒకటి.

సీనియర్ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో, కుల వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని అందుకోకపోయినా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ టేకింగ్, కథను నడిపించిన విధానం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాయి. తొలి సినిమాతోనే టాలెంటెడ్ డైరెక్టర్‌గా తన ముద్ర వేసిన మురళీకాంత్‌కు ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ మైండ్ బ్లోయింగ్ ఆఫర్ వచ్చినట్లు ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

తన సహజ నటనతో నేచురల్ స్టార్‌గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నాని.. నిర్మాతగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ ద్వారా కొత్త కథలను, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. 'అ!', 'హిట్' ఫ్రాంచైజీ, కోర్ట్ రూమ్ డ్రామాలతో ఈ బ్యానర్‌కు ప్రత్యేక బ్రాండ్ వాల్యూ తీసుకొచ్చారు.

ఇప్పుడు ఇదే బ్యానర్‌లో దర్శకుడు మురళీకాంత్ దేవసోత్‌తో నాని ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మురళీకాంత్ చెప్పిన పవర్‌ఫుల్, డిఫరెంట్ స్క్రిప్ట్ నానికి విపరీతంగా నచ్చడంతో.. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త కూడా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కన్నడ క్రష్, 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్‌ను దాదాపు ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సౌత్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రుక్మిణికి.. నాని వాల్ పోస్టర్ సినిమాస్ నుంచి ఆఫర్ రావడం ఆమె కెరీర్‌కు మరో పెద్ద ప్లస్‌గా మారనుంది. కథ విన్న వెంటనే ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్.

అయితే ఈ ప్రాజెక్ట్‌లో అసలైన సస్పెన్స్ మాత్రం హీరో ఎంపికే. రుక్మిణి వసంత్‌కు జోడీగా స్టార్ హీరోను తీసుకుంటారా? లేక కొత్త ముఖాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తారా? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హీరో ఎంపిక పూర్తైన వెంటనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో సర్ప్రైజ్ ఇవ్వాలని నాని టీమ్ భావిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, నాని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌లో శైలేష్ కొలను దర్శకత్వంలో కార్తి హీరోగా తెరకెక్కనున్న 'హిట్-4' సెట్స్‌పైకి వెళ్లకముందే.. ఈ మురళీకాంత్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనులు వేగంగా జరుగుతున్నాయట. ఆగస్టు నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

టాలెంటెడ్ డైరెక్టర్ మురళీకాంత్, ట్రెండింగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్, నాని ప్రొడక్షన్ వాల్యూస్.. ఈ మూడు కలిస్తే ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన రాకముందే ఈ కాంబినేషన్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారడం విశేషం.

టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా ఓ ఇంట్రెస్టింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడని కొన్ని సినిమాలు.. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. “ఇంత మంచి సినిమాను థియేటర్లలో ఎందుకు మిస్ అయ్యామా?” అంటూ ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి. అలాంటి కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చిత్రాల్లో గతేడాది వచ్చిన ‘దండోరా’ ఒకటి.

సీనియర్ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో, కుల వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని అందుకోకపోయినా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ టేకింగ్, కథను నడిపించిన విధానం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాయి. తొలి సినిమాతోనే టాలెంటెడ్ డైరెక్టర్‌గా తన ముద్ర వేసిన మురళీకాంత్‌కు ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ మైండ్ బ్లోయింగ్ ఆఫర్ వచ్చినట్లు ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

తన సహజ నటనతో నేచురల్ స్టార్‌గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నాని.. నిర్మాతగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ ద్వారా కొత్త కథలను, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ‘అ!’, ‘హిట్’ ఫ్రాంచైజీ, కోర్ట్ రూమ్ డ్రామాలతో ఈ బ్యానర్‌కు ప్రత్యేక బ్రాండ్ వాల్యూ తీసుకొచ్చారు.

ఇప్పుడు ఇదే బ్యానర్‌లో దర్శకుడు మురళీకాంత్ దేవసోత్‌తో నాని ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మురళీకాంత్ చెప్పిన పవర్‌ఫుల్, డిఫరెంట్ స్క్రిప్ట్ నానికి విపరీతంగా నచ్చడంతో.. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త కూడా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కన్నడ క్రష్, ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణి వసంత్‌ను దాదాపు ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సౌత్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రుక్మిణికి.. నాని వాల్ పోస్టర్ సినిమాస్ నుంచి ఆఫర్ రావడం ఆమె కెరీర్‌కు మరో పెద్ద ప్లస్‌గా మారనుంది. కథ విన్న వెంటనే ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్.

అయితే ఈ ప్రాజెక్ట్‌లో అసలైన సస్పెన్స్ మాత్రం హీరో ఎంపికే. రుక్మిణి వసంత్‌కు జోడీగా స్టార్ హీరోను తీసుకుంటారా? లేక కొత్త ముఖాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తారా? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హీరో ఎంపిక పూర్తైన వెంటనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో సర్ప్రైజ్ ఇవ్వాలని నాని టీమ్ భావిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, నాని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌లో శైలేష్ కొలను దర్శకత్వంలో కార్తి హీరోగా తెరకెక్కనున్న ‘హిట్-4’ సెట్స్‌పైకి వెళ్లకముందే.. ఈ మురళీకాంత్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనులు వేగంగా జరుగుతున్నాయట. ఆగస్టు నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

టాలెంటెడ్ డైరెక్టర్ మురళీకాంత్, ట్రెండింగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్, నాని ప్రొడక్షన్ వాల్యూస్.. ఈ మూడు కలిస్తే ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన రాకముందే ఈ కాంబినేషన్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారడం విశేషం.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు