Search
Close this search box.

  నానికి జోడిగా క్రేజీ హీరోయిన్..?

April 19, 2026 6:11 PM | Aditya369 News

నానికి జోడిగా క్రేజీ హీరోయిన్..?

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్‌లో అద్భుతమైన ఫేజ్‌లో ఉన్నారు. వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తన ప్రత్యేకతను చాటుతున్నారు. ‘దసరా’ వంటి మాస్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ తో కలిసి చేస్తున్న ‘ప్యారడైజ్’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా, నాని – సుజిత్ కాంబినేషన్‌లో రాబోతున్న మరో సినిమా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌కు ‘బ్లడీ రోమియో’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై గత కొద్ది రోజులుగా అనేక ఊహాగానాలు వినిపించాయి.

తాజా సమాచారం ప్రకారం, కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ ఈ సినిమాలో నానికి జోడీగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో ‘నా సామిరంగా’ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆషికా, ఇప్పుడు నేచురల్ స్టార్ సరసన నటించే అవకాశం రావడం విశేషంగా మారింది.

నాని – ఆషికా కాంబినేషన్ ఇదే మొదటిసారి కావడంతో ఈ కొత్త జంట వెండితెరపై ఎలా మెప్పిస్తుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సుజిత్ తన సినిమాల్లో హీరోయిన్లను స్టైలిష్, పవర్‌ఫుల్ పాత్రల్లో చూపించడం ప్రత్యేకత. అందుకే ‘బ్లడీ రోమియో’లో ఆషికా పాత్ర ఎలా ఉంటుందోనన్న ఆసక్తి మరింత పెరిగింది.

ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఒకవైపు శ్రీకాంత్ తో రా అండ్ రస్టిక్ స్టైల్ సినిమా చేస్తూనే, మరోవైపు సుజీత్ తో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ను లైన్‌లో పెట్టడం నాని ప్లానింగ్‌ను చూపిస్తోంది.

సోషల్ మీడియాలో వస్తున్న అప్‌డేట్స్ ప్రకారం, ఈ సినిమాలో నాని పూర్తిగా కొత్త లుక్‌లో, గ్యాంగ్‌స్టర్ షేడ్స్‌తో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఆషికా ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌కు గ్లామర్‌తో పాటు క్రేజ్ కూడా పెరిగింది. మొత్తానికి ‘బ్లడీ రోమియో’పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పొచ్చు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore