యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తన 24వ చిత్రం (NC 24) షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో అత్యున్నత స్థాయిలో రూపొందుతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘NC 24’ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం తాజాగా నాగ చైతన్య ఒక స్పెషల్ BTS (బిహైండ్ ది సీన్స్) మేకింగ్ వీడియోను విడుదల చేసి సర్ప్రైజ్ చేశారు. ఈ మేకింగ్ వీడియో సినిమాపై ఆసక్తిని, ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను ఎంతో ఎగ్జైట్ చేసినప్పటికీ, టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయకపోవడంపై అభిమానులు కొంత అసంతృప్తిగా ఉన్నారు.
అభిమానుల నిరాశను తొలగిస్తూ, నాగ చైతన్య తన పుట్టినరోజు ప్రత్యేకంగా నవంబర్ 23న సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో, రాబోయే టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రకటనతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.








