టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గత ఏడాది విడుదలైన దేవర సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించగా, దాని సీక్వెల్ దేవర 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
శింబుకు కీలక పాత్ర
మొదట ఈ సీక్వెల్ రాదనే వార్తలు వచ్చినా, తాజాగా దేవర 2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్శకుడు కొరటాల శివ కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేసి, ఎన్టీఆర్ పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా కోలీవుడ్ స్టార్ శింబు కూడా కీలక పాత్రలో నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
జాన్వి కపూర్‌తో మరో హీరోయిన్?
ఈ సినిమాలో జాన్వి కపూర్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. అయితే ఆమెతో పాటు మరో హీరోయిన్ను కూడా తీసుకోవాలని చిత్రబృందం ఆలోచనలో ఉందని వార్తలు వస్తున్నాయి.
డ్రాగన్ తర్వాతే దేవర 2
ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాతే దేవర 2 ప్రారంభం కానుందని సమాచారం. అయితే కొరటాల బాలకృష్ణతో కూడా సినిమా చేసే అవకాశం ఉందని టాక్.
గత ఏడాది దసరాకు విడుదలైన దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో మెప్పించి, భారీ కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విజయాన్ని దాటి దేవర 2 ఏ స్థాయిలో రాబోతుందో చూడాలి..








