Search
Close this search box.

  ‘దేవర 2’పై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాక్..!

May 23, 2026 2:02 PM | Aditya369 News

‘దేవర 2’పై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాక్..!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈసారి బర్త్‌డేను ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో ట్రెండ్ చేస్తూ… గ్లింప్స్‌ను నేషనల్ వైడ్ వైరల్ చేశారు. కానీ అదే సమయంలో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన విషయం ఏంటంటే… ‘దేవర 2’ నుంచి ఒక్క చిన్న అప్డేట్ కూడా రాకపోవడం.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ సినిమా పాన్ ఇండియా లెవెల్లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ… ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సినిమాను భుజాలపై మోసి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ వచ్చేలా చేశారు. సినిమా క్లైమాక్స్‌లోనే సీక్వెల్‌కు భారీ లీడ్ కూడా ఇచ్చారు. దీంతో ‘దేవర 2’పై అప్పట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే… ఆ సీక్వెల్‌పై మేకర్స్ ఫోకస్ తగ్గిందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఎన్టీఆర్ బర్త్‌డే లాంటి పెద్ద సందర్భంలో కూడా ‘దేవర 2’కి సంబంధించిన కొత్త పోస్టర్ కానీ, గ్లింప్స్ కానీ, కనీసం కాన్సెప్ట్ అప్డేట్ కూడా ఇవ్వలేదు. కేవలం ‘దేవర’ ఫస్ట్ పార్ట్ పోస్టర్‌తోనే విషెస్ చెప్పేయడంతో అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు.

ఇప్పటికే ఇండస్ట్రీలో ‘దేవర 2’పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ ప్రస్తుతం బాలకృష్ణతో కొత్త ప్రాజెక్ట్ వైపు మూవ్ అవుతుండగా… ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న ‘డ్రాగన్’ రెండు పార్ట్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారని టాక్. ఈ లెక్కన చూస్తే ‘దేవర 2’ ప్రాజెక్ట్ చాలా కాలం పాటు హోల్డ్‌లో పడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అంతేకాదు… కొందరు ఫ్యాన్స్ అయితే “ఇక దేవర 2ని మర్చిపోవాల్సిందేనా?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే అధికారికంగా మాత్రం మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ సీక్వెల్ నిజంగానే తెరకెక్కుతుందా? లేక కేవలం అనౌన్స్‌మెంట్ వరకే పరిమితమవుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు