Search
Close this search box.

  “ది లోన్ వోల్ఫ్”తో రామ్ రీ-ఎంట్రీ..!

April 19, 2026 9:37 PM | Aditya369 News

“ది లోన్ వోల్ఫ్”తో రామ్ రీ-ఎంట్రీ..!

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తన కెరీర్‌లో కాస్త కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన నటించిన ది వారియర్, స్కంద, అలాగే డబల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఎంతో నమ్మకంతో చేసిన మరో ప్రాజెక్ట్ కూడా నిరాశపరచడంతో, రామ్ ఇప్పుడు తన తదుపరి సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఇటీవల కొంతకాలం గ్యాప్ తీసుకున్న రామ్, ఆ సమయంలో కథలపై పూర్తిగా ఫోకస్ పెట్టి, కొత్తగా, విభిన్నంగా కనిపించే కాన్సెప్ట్‌లను సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా, ఈసారి ఆయన స్వయంగా ఒక కథను రాసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆ కథకు “ది లోన్  వోల్ఫ్” అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం.

ఇక నటుడిగానే కాకుండా రచయితగా కూడా తనలోని కొత్త టాలెంట్‌ను చూపించాలని రామ్ భావిస్తున్నారు. ఎప్పటిలాగే ఎనర్జీతో కాకుండా, ఈసారి కంటెంట్‌పై బలంగా నిలబడే ప్రయత్నంలో ఉన్నారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు కథ రెడీగా ఉన్నప్పటికీ, దానికి దర్శకత్వం వహించే దర్శకుడు ఇంకా ఫైనల్ కాలేదు. కథకు సరిపోయే టాలెంటెడ్ డైరెక్టర్ కోసం రామ్ వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో, లోకేష్ కనగారాజ్ ఆసిస్టెంట్ ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశముందనే టాక్ వినిపిస్తున్నా, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి రామ్ స్వయంగా రాసుకున్న “ది లోన్  వోల్ఫ్” ఆయన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకువస్తుందా? బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore