Search
Close this search box.

  డైరెక్టర్ గా మారిన కమెడియన్..! సక్సెస్ అవుతాడా..?

June 14, 2025 2:50 PM | Aditya369 News

డైరెక్టర్ గా మారిన కమెడియన్..! సక్సెస్ అవుతాడా..?

తెలుగు సినిమా ప్రేక్షకులకు తన నేచురల్ యాక్టింగ్ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో కమెడియన్ మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త మలుపు తీసుకుంటున్నారు.. అనేక సినిమాల్లో నటించిన ఈ యాక్టర్, అర్జున్ రెడ్డి తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు.. ఆ తరువాత సినిమాల్లో కమెడియన్ గా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు... అయితే ఇప్పుడు ఈ కమెడియన్ డైరెక్టర్ గా ఓ కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.. ఈ విషయాన్ని రాహుల్ తాను స్వయంగా ప్రకటించారు.

“దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్‌ ప్రారంభం. ఎవరికైనా ఆసక్తి ఉంటే మీ షోరీల్స్, ఫొటోలు ఈ మెయిల్‌కు పంపించండి,”అని తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ ఇప్పటికే సిద్ధం అయినట్లు సమాచారం.. ఈ సినిమా కథ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో కామెడీ ప్రధానంగా రాబోతున్నట్లు సమాచారం..

ప్రస్తుతం నటీనటుల ఎంపిక వంటి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.. అంతే కాకుండా, ఈ సినిమాకు రాహుల్ స్వయంగా నిర్మాతగానూ వ్యవహరించనున్నారని తెలుస్తోంది..అంతేకాక, రాహుల్ రామకృష్ణకు రచన, జర్నలిజం వంటి ఇతర రంగాల్లోనూ అనుభవం ఉంది. ఆయనకు సినిమాకు సంబంధించి కథాంశం, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ వంటి వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. కానీ ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయని తెలుస్తోంది. కొద్ది నెలల్లో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది..

తెలుగు సినిమా ప్రేక్షకులకు తన నేచురల్ యాక్టింగ్ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో కమెడియన్ మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త మలుపు తీసుకుంటున్నారు.. అనేక సినిమాల్లో నటించిన ఈ యాక్టర్, అర్జున్ రెడ్డి తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు.. ఆ తరువాత సినిమాల్లో కమెడియన్ గా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు… అయితే ఇప్పుడు ఈ కమెడియన్ డైరెక్టర్ గా ఓ కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.. ఈ విషయాన్ని రాహుల్ తాను స్వయంగా ప్రకటించారు.

“దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్‌ ప్రారంభం. ఎవరికైనా ఆసక్తి ఉంటే మీ షోరీల్స్, ఫొటోలు ఈ మెయిల్‌కు పంపించండి,”అని తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ ఇప్పటికే సిద్ధం అయినట్లు సమాచారం.. ఈ సినిమా కథ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో కామెడీ ప్రధానంగా రాబోతున్నట్లు సమాచారం..

ప్రస్తుతం నటీనటుల ఎంపిక వంటి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.. అంతే కాకుండా, ఈ సినిమాకు రాహుల్ స్వయంగా నిర్మాతగానూ వ్యవహరించనున్నారని తెలుస్తోంది..అంతేకాక, రాహుల్ రామకృష్ణకు రచన, జర్నలిజం వంటి ఇతర రంగాల్లోనూ అనుభవం ఉంది. ఆయనకు సినిమాకు సంబంధించి కథాంశం, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ వంటి వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. కానీ ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయని తెలుస్తోంది. కొద్ది నెలల్లో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore