Search
Close this search box.

  ‘డిమోంటీ కాలనీ’ డైరెక్టర్‌తో లారెన్స్ క్రేజీ కాంబో..!

May 28, 2026 12:37 PM | Aditya369 News

‘డిమోంటీ కాలనీ’ డైరెక్టర్‌తో లారెన్స్ క్రేజీ కాంబో..!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హారర్ కామెడీ జానర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన హీరోల్లో రాఘవ లారెన్స్  పేరు ముందుంటుంది. తనదైన స్టైల్‌లో పలు హారర్ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులను అలరించిన లారెన్స్, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో రాబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ‘డిమోంటీ కాలనీ’ వంటి సస్పెన్స్ హారర్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు లారెన్స్ చేతులు కలపనున్నట్టుగా సమాచారం. ఈ కాంబినేషన్‌నే ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఫాంటసీ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందని తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ చిత్రాన్ని కోలీవుడ్‌కు చెందిన ఓ కొత్త నిర్మాణ సంస్థ గ్రాండ్ స్కేల్‌లో నిర్మించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. హారర్, థ్రిల్, ఫాంటసీ అంశాలతో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి లారెన్స్ – అజయ్ జ్ఞానముత్తు కాంబో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు