Search
Close this search box.

  డబుల్ రోల్‌లో రామ్ చరణ్..? ఫ్యాన్స్‌లో కొత్త డౌట్స్..!

March 28, 2026 11:09 PM | Aditya369 News

డబుల్ రోల్‌లో రామ్ చరణ్..? ఫ్యాన్స్‌లో కొత్త డౌట్స్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో పూర్తవుతుందని సమాచారం. ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 30న ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మెగా అభిమానులు ఈ సినిమాకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవల విడుదలైన ‘పహిల్వాన్ గ్లింప్స్’ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ వీడియో సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ గ్లింప్స్ చూసిన అభిమానులు సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారేమో అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ముందుగా విడుదలైన గ్లింప్స్‌లో చెవి, ముక్కుకు పోగులతో కనిపించిన చరణ్, తాజా పహిల్వాన్ గ్లింప్స్‌లో ఆ లుక్‌లో లేకపోవడం ఈ అనుమానాలకు కారణమైంది. దీంతో తండ్రి-కొడుకుల పాత్రల్లో నటిస్తున్నారా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

గ్రామీణ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్రికెట్‌తో పాటు కుస్తీ కూడా ముఖ్య పాత్ర పోషించనుంది. సీనియర్ నటుడు జగపతిబాబు ‘అప్పలసూరి’ పాత్రలో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు