లీక్‌లకు ‘కాదే సినిమా కనర్హం’ అన్నట్టు ఇండస్ట్రీలో పరిస్థితి మారుతోంది. ఇటీవల జననాయగన్ సినిమా పైరసీ బారిన పడిన సంగతి తెలిసిందే. అదే దారిలో ఇప్పుడు జైలర్ 2 కూడా నడుస్తోంది. రజినీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన కీలక సీన్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో మేకర్స్ షాక్ అయ్యారు.
ఈ ఘటనతో వెంటనే స్పందించిన సన్ పిక్చర్స్ యాంటీ పైరసీ టీమ్ రంగంలోకి దిగింది. లీక్ అయిన కంటెంట్‌ను ఎవరు షేర్ చేసినా, ప్రమోట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేవలం లీగల్ యాక్షన్ మాత్రమే కాదు, సంబంధిత సోషల్ మీడియా అకౌంట్స్‌ను పర్మనెంట్‌గా బ్లాక్ చేస్తామని కూడా స్పష్టం చేసింది.
ఇక వరుసగా స్టార్ హీరోల సినిమాలు లీక్ అవుతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మొన్న ‘జననాయగన్’, నేడు ‘జైలర్ 2’… షూటింగ్ సెట్స్‌లో మొబైల్ ఫోన్లు నిషేధించినా కూడా ఈ వీడియోలు ఎలా బయటకు వస్తున్నాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది. టెక్నికల్ టీమ్ నుంచే లీక్ అవుతున్నాయా? లేక బయటి వ్యక్తుల పనా? అన్న కోణంలో విచారణ కొనసాగుతోందని సమాచారం.
ఇది కొత్త సమస్య కాదు. గతంలో వారసుడు, లియో చిత్రాల షూటింగ్ వీడియోలు కూడా లీక్ అయ్యాయి. అలాగే ఇండియన్ 2, తునివు, కంగువ వంటి భారీ ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన ఫోటోలు, మేకింగ్ వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి.
భారీ బడ్జెట్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభవం ఇవ్వాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఇలాంటి లీకులు ఇండస్ట్రీకి పెద్ద నష్టం కలిగిస్తున్నాయనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఇక ‘జైలర్ 2’ విషయానికి వస్తే… రజినీకాంత్‌తో పాటు రమ్యకృష్ణ, యోగి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ నటులు కూడా ఈ సినిమాలో భాగమవుతుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.
అయితే క్యామియోస్పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. షారుఖ్ ఖాన్ వస్తాడని, నందమూరి బాలకృష్ణ కనిపిస్తాడని, లేదా పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్ ఇస్తాడని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఈ విషయంలో మౌనం పాటిస్తున్నారు.
ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే… ‘జైలర్ 2’ జూన్ 12న అనుకున్న తేదీకి విడుదల అవుతుందా? లేక మరికొంత సమయం తీసుకుంటుందా? చూడాలి మరి..









