Search
Close this search box.

  చిరంజీవితో సినిమా నావల్ల కాదు: రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

November 19, 2025 6:48 PM | Aditya369 News

చిరంజీవితో సినిమా నావల్ల కాదు: రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన క్లాసిక్ చిత్రం 'శివ' 4K రీ-రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పడం, కృతజ్ఞతలు తెలపడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో వర్మ మెగా కుటుంబంపై చేసిన విమర్శల గురించి పరోక్షంగా స్పందించి క్షమించమని కోరడం అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవితో సినిమా ఎందుకు చేయలేదనే ప్రశ్నకు వర్మ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
"చిరంజీవి గారితో సినిమా చేసే కెపాసిటీ నా దగ్గర లేదు. నా సెన్సిబిలిటీలో ఉన్న కథలు, ఆయన ఇమేజ్‌కి, ఆయనపై ఆయన అభిమానులు పెట్టుకునే అంచనాలకు సరిపోవు. తప్పుగా అర్థం చేసుకోవద్దు… కానీ నిజంగా నాకు ఆ రేంజ్‌లో సినిమా చేయడం సాధ్యం కాదు" అని వర్మ ఒప్పుకున్నారు. చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ఉన్నా, ఆయన స్థాయి విజన్‌కి తాను సరిపోననే నిజాయితీని వర్మ స్పష్టంగా చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
వర్మ, చిరంజీవి కాంబినేషన్‌లో 'శివ' చిత్రం విజయానంతరం 'వినాలని ఉంది' అనే సినిమా సెట్ అయినా, బాలీవుడ్ ఆఫర్ కారణంగా వర్మ ఆ ప్రాజెక్ట్‌ను మధ్యలోనే వదిలిపెట్టారని అప్పటి సినీ వర్గాల్లో టాక్ ఉంది. దీంతో వీరిద్దరి మధ్య ఏళ్ల పాటు దూరం పెరిగిందని సమాచారం. అయితే, తాజాగా వర్మ చేసిన వ్యాఖ్యలు ఆయన నిజాయితీని, వినయాన్ని తెలియజేస్తున్నాయని, 'శివ' తర్వాత ఆయన తీసిన రియలిస్టిక్ సినిమాల శైలి, చిరంజీవి భారీ మాస్ ఇమేజ్‌కి సరిపోదన్న వర్మ మాటలు కరెక్టేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన క్లాసిక్ చిత్రం ‘శివ’ 4K రీ-రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పడం, కృతజ్ఞతలు తెలపడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో వర్మ మెగా కుటుంబంపై చేసిన విమర్శల గురించి పరోక్షంగా స్పందించి క్షమించమని కోరడం అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవితో సినిమా ఎందుకు చేయలేదనే ప్రశ్నకు వర్మ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

“చిరంజీవి గారితో సినిమా చేసే కెపాసిటీ నా దగ్గర లేదు. నా సెన్సిబిలిటీలో ఉన్న కథలు, ఆయన ఇమేజ్‌కి, ఆయనపై ఆయన అభిమానులు పెట్టుకునే అంచనాలకు సరిపోవు. తప్పుగా అర్థం చేసుకోవద్దు… కానీ నిజంగా నాకు ఆ రేంజ్‌లో సినిమా చేయడం సాధ్యం కాదు” అని వర్మ ఒప్పుకున్నారు. చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ఉన్నా, ఆయన స్థాయి విజన్‌కి తాను సరిపోననే నిజాయితీని వర్మ స్పష్టంగా చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.

వర్మ, చిరంజీవి కాంబినేషన్‌లో ‘శివ’ చిత్రం విజయానంతరం ‘వినాలని ఉంది’ అనే సినిమా సెట్ అయినా, బాలీవుడ్ ఆఫర్ కారణంగా వర్మ ఆ ప్రాజెక్ట్‌ను మధ్యలోనే వదిలిపెట్టారని అప్పటి సినీ వర్గాల్లో టాక్ ఉంది. దీంతో వీరిద్దరి మధ్య ఏళ్ల పాటు దూరం పెరిగిందని సమాచారం. అయితే, తాజాగా వర్మ చేసిన వ్యాఖ్యలు ఆయన నిజాయితీని, వినయాన్ని తెలియజేస్తున్నాయని, ‘శివ’ తర్వాత ఆయన తీసిన రియలిస్టిక్ సినిమాల శైలి, చిరంజీవి భారీ మాస్ ఇమేజ్‌కి సరిపోదన్న వర్మ మాటలు కరెక్టేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు