Search
Close this search box.

  చంద్రబాబువన్నీ అబద్ధాలే-పథకాలు తప్పించుకునేలా బడ్జెట్-జగన్ ఫైర్..!

November 20, 2024 6:33 PM | Aditya369 News

చంద్రబాబువన్నీ అబద్ధాలే-పథకాలు తప్పించుకునేలా బడ్జెట్-జగన్ ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం నడుపుతున్న సీఎం చంద్రబాబు అసెంబ్లీలో బడ్జెట్ పై చేసిన ప్రసంగంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో అప్పులపై తప్పుడు ప్రచారం చేసి దొరికిపోయిన ప్రభుత్వం.. ఇప్పుడు కాగ్ రిపోర్టుపైనా అవాస్తవాల్ని ప్రచారం చేస్తోందన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలు చేయలేక బడ్జెట్ లో వాటికి కేటాయింపులు చేయలేక తప్పించుకుందని జగన్ ఆరోపించారు.

అసెంబ్లీలో తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎన్నికల హమీలైన సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపు చేయకుండా చంద్రబాబు తప్పించుకున్నారని జగన్ ఆరోపించారు. అంతటితో ఆగకుండా తమ హయాంపై కాగ్ రిపోర్టు వస్తే దానిపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వ అప్పులపై తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు వాటిని నిరూపించలేక మాట మారుస్తున్నారని జగన్ ఆక్షేపించారు.

బడ్జెట్ లో ఉచిత గ్యాస్ సిలెండర్ల వంటి చిన్న చిన్న పథకాలకు సైతం నిధులు కేటాయించలేని పరిస్ధితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఉందని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం బడ్జెట్ లో ఉచిత సిలెండర్లకు కేటాయించిన నిధులతో మూడు సిలెండర్లు ఉచితంగా ఎలా ఇస్తారన ప్రశ్నించారు. అలాగే బడ్జెట్ లో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆరోగ్య శ్రీ పథకం పేరు మార్చి తామేమ అమలు చేసినట్లు చెప్పుకుంటున్నారని జగన్ ఆరోపించారు.

గత వైసీపీ ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే సచివాలయాల్లో లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, 50 వేల ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలోకి తీసుకున్నామని, 2.66 లక్షల వాలంటీర్లను నియమించామని, కానీ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్క ఉద్యోగం కల్పించలేదన్నారు. మెగా డీఎస్సీ పేరుతో గతంలో తాము ఇచ్చిన ఉద్యోగాల్ని సైతం భర్తీ చేయలేని పరిస్ధితుల్లో ఉందన్నారు. అంతే కాదు తాము నియమించిన వాలంటీర్లను తొలగిస్తున్నారని జగన్ విమర్శించారు.

తమ హయాంలో ఆరోగ్య శ్రీలో వైద్యం చేయించుకునే మొత్తం 25 లక్షలకు పెంచామని, కానీ ఇప్పుడు ప్రభుత్వం 108కే జీతాలివ్వడం లేదన్నారు. ఆరునెలలుగా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లో ఉంచేశారన్నారు. పేదలకు గతంలో ఇంటి స్థలం, ఇళ్లు ఇవ్వని చంద్రబాబు, తాము ఇచ్చిన ఇళ్లు పూర్తయితే పేరు జగన్ కు వస్తుందని ఆపేశారన్నారు. ఎందుకు అసెంబ్లీ నడుపుతున్నారో, ఎందుకు ప్రభుత్వం నడుపుతున్నారో తెలియడం లేదన్నారు. ప్రజలకు అవసరమైన పనులన్నీ పక్కకు పోయాయన్నారు. రాష్ట్రమంతా మాఫియా ముఠాలు కనిపిస్తున్నాయన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore