Search
Close this search box.

  కేటీఆర్ సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా పాద యాత్ర..

November 1, 2024 5:38 PM | Aditya369 News

కేటీఆర్ సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా పాద యాత్ర..

తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల తరువాత కుదేలైన బీఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్సాహం ఇవ్వటానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. మసకబారుతున్న బిఆర్ఎస్ ప్రభావాన్ని మళ్లీ పునరుద్ధరించడానికి కేటీఆర్ రంగంలోకి దిగబోతున్నారు. బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపి ప్రజల నుంచి మద్దతు సంపాదించడానికి కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కేటీఆర్ పాదయాత్ర

గత ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుండి కేసీఆర్, కేటీఆర్ ఎన్ని వ్యూహాలు రచించినా సరే అవి సరైన ఫలితాలు ఇవ్వలేదు. ఇక కవిత అరెస్ట్, ఎంపీ ఎన్నికల ఓటమి, పార్టీ నుండి ముఖ్య నాయకుల ఫిరాయింపులు వెరసి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఇక ఇదే సమయంలో కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తానని పాదయాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్తానని చెప్పటం పార్టీ శ్రేణుల్లో జవసత్వాలు నింపింది.

ఎన్నికల ఓటమితో బలహీనపడిన బీఆర్ఎస్

పార్టీ కార్యకర్తల ఆకాంక్షలతో భవిష్యత్తులో పాదయాత్ర చేస్తానని చెప్పిన కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, నష్టాలను గురించి మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ వైఫల్యాలు కారణమవుతాయని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత బిఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరిగా ప్రజాప్రతినిధులు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతోంది.

ఆస్క్ కేటీఆర్ లో పాదయాత్రపై కేటీఆర్ స్పష్టత

ఇక ఇదే సమయంలో పార్టీని కాపాడుకోవడం కోసం కేసీఆర్ వ్యూహంలో భాగంగా కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్టు తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో అర్థమవుతుంది. ఎక్స్ వేదికగా ఆస్క్ కేటీఆర్ క్యాంపెయిన్ లో భాగంగా అనేకమంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన కేటీఆర్ ఈ సమయంలో తన పాదయాత్ర గురించి మాట్లాడారు.

పాదయాత్రతో ప్రజల్లోకి

పార్టీని కాపాడుకోవడానికి వచ్చే ఎన్నికలలో తిరిగి అధికారాన్ని దక్కించుకోవడానికి పాదయాత్ర ఒకటే మార్గమని బీఆర్ఎస్ భావిస్తోంది. అంతేకాదు ఇప్పటివరకు ఏ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినా ఆయా రాష్ట్రాలలో పాదయాత్రలు చేసిన పార్టీలు విజయాన్ని సాధించాయి. దీంతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ప్రజల సంపూర్ణ మద్దతుతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ అధినేత ఆదేశాలతో కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారని సమాచారం.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు