Search
Close this search box.

  ‘కేజీఎఫ్ 3’పై సైలెన్స్ బ్రేక్..! యష్ బిగ్ స్టేట్‌మెంట్..!

April 21, 2026 11:43 PM | Aditya369 News

‘కేజీఎఫ్ 3’పై సైలెన్స్ బ్రేక్..! యష్ బిగ్ స్టేట్‌మెంట్..!

రాకింగ్ స్టార్ యష్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కేజీఎఫ్’ సిరీస్ ఇండియన్ సినిమా రేంజ్‌ను మార్చేసిన విషయం తెలిసిందే. మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించగా… ‘కేజీఎఫ్ 2’ అయితే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ భారీ కలెక్షన్లు రాబట్టింది. క్లైమాక్స్‌లోనే మూడో భాగానికి హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ‘కేజీఎఫ్ 3’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఇంతకాలం ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో… ఈ సినిమా ఉంటుందా లేదా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో యష్ తాజాగా ఇచ్చిన క్లారిటీ ఫ్యాన్స్‌కు ఊరటనిచ్చింది.

‘కేజీఎఫ్ 3’ కన్ఫర్మ్… కానీ టైమ్ పడుతుంది

ఒక ఇంటర్వ్యూలో యష్ మాట్లాడుతూ… ‘కేజీఎఫ్ 3’ తప్పకుండా ఉంటుందని, ఇప్పటికే ప్రశాంత్ నీల్‌తో దీనిపై చర్చలు కూడా జరిగాయని వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్ వెంటనే ప్రారంభం కాదని… సరైన టైమ్‌లోనే స్టార్ట్ అవుతుందని చెప్పారు.

ప్రస్తుతం తాను ‘టాక్సిక్’తో పాటు ‘రామాయణ’ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నానని… అవి పూర్తయ్యాకే ‘కేజీఎఫ్ 3’పై ఫోకస్ చేస్తానని స్పష్టం చేశారు.

2030 వరకు వేచి చూడాలా?

యష్ చేస్తున్న ప్రాజెక్ట్‌లు పూర్తయ్యే సరికి 2028 దాకా పడే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతే ‘కేజీఎఫ్ 3’ మొదలైతే… సినిమా విడుదలకు 2030 వరకూ వేచి చూడాల్సి రావొచ్చని ఫ్యాన్స్‌లో టాక్ వినిపిస్తోంది.

ప్రశాంత్ నీల్ షెడ్యూల్ కూడా ఫుల్

ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తుండగా… తర్వాత ప్రభాస్‌తో ‘సలార్ 2’ ప్రాజెక్ట్ ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే ‘కేజీఎఫ్ 3’పై ఆయన దృష్టి సారించే అవకాశం ఉంది.

యష్ లైన్‌లో భారీ ప్రాజెక్ట్స్

యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో ‘రామాయణ’ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు.

మొత్తానికి ‘కేజీఎఫ్ 3’ ఖచ్చితంగా వస్తుందనే క్లారిటీ వచ్చినా… అది ఎప్పుడు వస్తుందన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore