నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వీరసింహారెడ్డి’లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో నందమూరి అభిమానులు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాలయ్య సినిమాలో హనీరోజ్ ఎంట్రీ?
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మలయాళ బ్యూటీ హానీ రోజ్ కీలక పాత్రలో కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హనీరోజ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతుందన్న వార్త బయటకు రావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
మూడేళ్ల క్రితం వచ్చిన ‘వీరసింహారెడ్డి’లో బాలకృష్ణ – హనీరోజ్ కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా భార్యాభర్తలుగా వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మరోసారి ఈ హిట్ పెయిర్ స్క్రీన్‌పై కనిపించబోతుందన్న వార్త నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతోంది.
‘సుగుణ సుందరి’ మ్యాజిక్ మళ్లీ?
‘వీరసింహారెడ్డి’లో హనీరోజ్ పోషించిన ‘మీనాక్షి’ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ‘సుగుణ సుందరి’ పాటలో బాలయ్య – హనీరోజ్ డ్యాన్స్ మూమెంట్స్ సోషల్ మీడియాలో భారీ ట్రెండ్ అయ్యాయి. ఆ కెమిస్ట్రీనే ఇప్పుడు మరోసారి రిపీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఇక ‘వీరసింహారెడ్డి’ తర్వాత హనీరోజ్ తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. అలాంటి సమయంలో మళ్లీ బాలకృష్ణ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుండటం ఆసక్తికరంగా మారింది.
భారీ అంచనాల్లో బాలయ్య కొత్త సినిమా
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ పవర్ఫుల్ పాత్ర, గోపిచంద్ మలినేని మాస్ టేకింగ్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పుడు హనీరోజ్ కూడా జాయిన్ అవుతుందన్న వార్తతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత బజ్ క్రియేట్ అయింది.








