Search
Close this search box.

  ఓటీటీలోకి మహావతార్ నరసింహ..! ఎప్పుడంటే..?

September 19, 2025 11:11 PM | Aditya369 News

ఓటీటీలోకి మహావతార్ నరసింహ..! ఎప్పుడంటే..?

కన్నడ డైరెక్టర్ అశ్విన్ కుమార్ తీసిన మహావతార్ నరసింహా సినిమాకు ఎలాంటి అంచనాలు లేకపోయినా, విడుదలైన వెంటనే బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. యానిమేషన్ రూపంలో నరసింహుడి ఉగ్రరూపం చూసిన ప్రేక్షకులు థియేటర్లలో కేకలు వేశారు.

రూ.40 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం, మొదటి 8 రోజుల్లోనే రూ.60 కోట్ల వసూళ్లు సాధించింది. లాంగ్ రన్‌లో అయితే రూ.300 కోట్లకు పైగా రాబట్టి, ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేషన్ మూవీగా చరిత్ర సృష్టించింది.

ఈ సంచలన చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. సెప్టెంబర్ 19 మధ్యాహ్నం 12.30 గంటలకు నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.

థియేటర్లలో ఈ స్థాయి విజయాన్ని అందుకున్న మహావతార్ నరసింహా, ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు