తెలుగు అమ్మాయి ఈషారెబ్బ, టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఇటీవలే జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుని యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ సమయంలోని మధుర జ్ఞాపకాలను ఈషారెబ్బ తన అభిమానులతో పంచుకుంది.
సినిమా మేకింగ్‌కు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్‌ను ఈషారెబ్బ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో షూటింగ్ లొకేషన్లో తరుణ్ భాస్కర్‌తో కలిసి ఆమె సరదాగా గడుపుతున్న దృశ్యాలు, అలాగే దర్శకుడు సీన్లను వివరిస్తున్నప్పటి ఆసక్తికరమైన మూమెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈషారెబ్బ, ఈ చిత్రంలో తన నటనకు గానూ మంచి మార్కులే సంపాదించుకుంది. కంటెంట్ పరంగా కొత్తగా ఉన్నప్పటికీ, కమర్షియల్ పరంగా ఈ సినిమా ఓ మోస్తరు వసూళ్లను సాధించింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ అప్డేట్స్తో ఈషా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది.








