ఏపీలో విద్యార్ధులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లను ఇకపై నేరుగా వాట్సాప్ ద్వారానే వారికి అందించేందుకు వీలుగా ఇవాళ ఓ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెటాతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. గతంలో యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు లోకేష్ ఈ ఒప్పందం చేసుకున్నారు. దీంతో విద్యార్ధులకు ఎంతో ప్రయోజనం చేకూరబోతోంది.
వాట్సాప్ ద్వారా పౌర-కేంద్రీకృత ప్రజా సేవలను ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం మరియు మెటా మధ్య ఒక మైలురాయి సహకారాన్ని ప్రకటించినందుకు సంతోషిస్తున్నట్లు విద్యామంత్రి నారా లోకేష్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.ఈ సహకారం త్వరలో మెటా యొక్క వినూత్న సాంకేతికత ద్వారా ప్రజా సేవలను సమర్ధవంతంగా అందజేస్తుంద్నారు. తతమ ప్రభుత్వం తమ ప్రజలకు కేవలం ఒక క్లిక్ దూరంలో ఉండేలా చూస్తుందని వెల్లడించారు.
విద్యార్ధులు, నిరుద్యోగులు తమకు అవసరమైన సర్ఠిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీనిపై నారా లోకేష్ గతంలో చేసిన యువగళం పాదయాత్ర సమయంలో ఫిర్యాదులు అందాయి. దీంతో వారికి వాట్సాప్ లోనే సర్ఠిఫికెట్లు అందేలా చూస్తామని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. దీన్ని నిలబెట్టుకునేందుకు ఇవాళ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదిరేలా చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో వాట్సాప్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ ద్వారా విద్యార్ధులు సర్ఠిఫికెట్లు పొందేలా త్వరలో ఏర్పాట్లు చేయనున్నారు.









